కీ. శే. శ్రీ పుల్లా వెంకట్ రెడ్డి జ్ఞపకార్థము

Uncategorized తాండూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంపూర్వ విద్యార్థుల సమ్మేళనం వికారాబాద్

కీ. శే. శ్రీ పుల్లా వెంకట్ రెడ్డి జ్ఞపకార్థము

శ్రీ పుల్లా వెంకట్ రెడ్డి మెమోరియల్ ద్వారా విజయ విద్యాలయ పాఠశాల పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ

పేద విద్యార్థులకు రూ::: 2000/- చొప్పున నలభై మంది విద్యార్థులకు మొత్తం రూ.. 80,000/-రూపాయలు స్కాలర్షిప్స్

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26::వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని విజయ విద్యాలయఉన్నత పాఠశాల పూర్వ విద్యార్ధి డాక్టర్ పుల్లా రఘు రామ్ రెడ్డి వారి తండ్రి కీ. శే. పుల్లా వెంకట్ రెడ్డి జ్ఞపకార్థము….

పుల్లా వెంకట్ రెడ్డి మెమోరియల్ ద్వారా విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల లోని పేద విద్యార్థులకు రూ::: 2000/- చొప్పున నలభై మంది విద్యార్థులకు మొత్తం రూ.. 80,000/-రూపాయలు స్కాలర్షిప్స్ పూర్వ విద్యార్థులయినా విజయ విద్యాలయ పాఠశాల కమిటీ అధ్యక్షుడు సుభాష్ సింగ్ ఠాగూర్, పెద్దలు దత్తాత్రేయ, అయినపురం అజయ్ గుప్తా, శెట్టి రమేష్, నరేందర్ రెడ్డి, వీరయ్య తదితరుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ విద్యల పాఠశాలలో ఎంతోమంది పేద విద్యార్థులు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అలాంటి విజయ విద్యాలయ పాఠశాల యొక్క పూర్వ వైభవాన్ని అందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాలని ఈ సందర్బంగా అన్నారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన దాదాపురం సతీష్, ఉపాధ్యాయురాలు, సునీత, చెన్మిళ్ళ విజయ్ కుమార్, ఆనందం, ప్రమోద్ కుమార్, గోపాల్ చౌహన్, వాలి శ్రావణ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.