వ్యర్ధాలను తరలిస్తున్నకంటైనర్లను సీజ్ చేయాలి…

Uncategorized క్రైమ్ సూర్యాపేట

వ్యర్ధాలను తరలిస్తున్నకంటైనర్లను సీజ్ చేయాలి

పర్యావరణాన్ని హాని కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

– జాతీయ రహదారి 365 బి బి రోడ్ల వెంట దుర్గంధంతో బాధపడుతున్న వాహనదారులు.

 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం అక్కలదేవి గూడెం గ్రామ ఊరు శివారులో 365బి బి ఖమ్మం బైపాస్ రోడ్డు ప్రక్కన్న ఆదివారం రాత్రి వ్యర్ధాలను పోస్తున్న రెండు కంటైనర్లను గ్రామస్తులు పట్టుకొని చివ్వేంల పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.జాతీయ రహదారి 365 బి బి రోడ్ల వెంట ఉన్న గ్రామ ప్రజలు దుర్గంధంతో బాధపడుతున్నారు. ఈ వ్యర్ధాలు రోడ్డు వెంట పోస్తున్నడంతో భూగర్భ జలాలు కలుషితమవు తున్నాయి. శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోడ్డు వెంట వెళ్లే వాహనదారులకు విపరీతమైన దుర్వాసన రావడంతో అనారోగ్యాల మారిన పడుతున్నారు. ఈ వ్యర్ధ పదార్థాల వాసనతో ఆరోగ్యాలు చెడిపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టుబడిన ఈ కంటైనర్లను తప్పించడానికి ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీనాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పొల్యూషన్ బోర్డ్ అధికారులు, పర్యావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి వ్యర్ధాలను గ్రామ సమీపంలో పోస్తున్న వాహనాలను సీజ్ చేసి వాటిని సప్లై చేస్తున్న కంపెనీలను మూసివేసి అందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి పైన కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరిపించాలని పలువురు కోరుకుంటున్నారు..పర్యావరణాన్ని కాపాడాలి.. తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వ్యక్తులపైన, వారికి సహకరిస్తున్న అధికారుల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ బోర్డ్ అధికారులు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి రాజకీయ నాయకుల ఒత్తిడికి తల్లోగ్గకుండా వ్యర్ధాలను సప్లై చేస్తున్న కంపెనీ యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని రక్షించాలి. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలి. భూగర్భ జలా లు కలుషితం కాకుండా చూడాలి.