అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
– అంత్యక్రియలకు రూ. 3వేల ఆర్థిక సాయం
తాండూరు రూరల్ మీ న్యూస్ ప్రతినిధి : మృతుని కుటుంబానికి కాంగ్రెస్ర్ పార్టీ చెందిన తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.తాండూర్ మండలంలోని అంతారం గ్రామానికి చెందిన నక్కల విజేందర్ అనారోగ్యంతో మృతి చెందినాడు. శనివారం నాడు అంతారంలోని తన నివాసంలోనే మృతి చెందాడు, మృతిచెందిన విషయం తెలుసుకున్న తాండూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ మృతుని అంత్యక్రియల కోసం రూ. 3వేల ఆర్థిక సాయం పంపించగా. అంతారం సీనియర్ కాంగ్రెస్ నాయకుల చేత 3వేల రూపాయలు మృతి చెందిన కుటుంబ సభ్యులకు అందజేశారు, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో అంతారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోస్గి ఆశప్ప, ఎల్మకన్య సొసైటీ డైరెక్టర్ పెండ నర్సిములు, జంగాని మొగులప్ప, పెండ రజినీకాంత్, తాండ్రా స్వామి దాస్, మ్యాథరి వెంకటయ్య, సంగెం శ్రీనివాస్, నక్కల పుల్లప్ప, పెండ ప్రకాష్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు