మెథడిస్ట్ చర్చ్ అన్న సాగర్ లో ఏసేబు చరిత్ర నాటకం ప్రారంభం..

Uncategorized క్రిస్మస్ సెలబ్రేషన్ తాండూర్ యాలల రాజాకియం వికారాబాద్

మెథడిస్ట్ చర్చ్ అన్న సాగర్ లో ఏసేబు చరిత్ర నాటకం ప్రారంభం..

 

యేసేబు చరిత్ర  నాటకం ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 27 ::: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం లోని యాలాల మండల అన్నసాగర్ మెథడిస్ట్ చర్చి లో బైబిల్ లో ఉన్న సువార్తను ప్రజలకు ఎలా అర్థం అవ్వాలో ఆ విధంగా ఈ యొక్క నాటకంలో తెలుపబడును. యేసేబు చరిత్ర నాటకం ప్రారంభోత్సవానికి మాజీ సర్పంచ్ రవి ఆహ్వానం మేరకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి విచ్చేసి అట్టి నాటకాన్ని ప్రారంభించారు.

 స్థానిక సంఘ కాపరి ఏం ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ.. బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి ఏసేపు తన జీవిత చరిత్ర దేవునితో సంబంధం ఎలా ఉందో అది కేవలం మాటలు రూపకంలో కాక ఆయన చరిత్రను నాటక రూపంలో ప్రజలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని ఆవిధంగా ఆ యొక్క ప్రభును ప్రజలు తెలుసుకుంటారని తెలియజేశారు. తనకు సహకరించిన గ్రామ ప్రజలకు మరియు నాయకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్నం మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో పలు నాయకులు మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్.పాస్టర్ ప్రవీణ్ కుమార్, వినయ శీలా, శ్రీనాథ్,సుధాకర్,కాంతు, రవి, సుకుమార్, బిచప్ప దేవదానం,దేవదాస్, శాంసంగ్, కిష్టయ్య,తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డలి రవీందర్,బిర్కెట్ రఘు,భగవాన్, సిద్ధూ,సంకేత్ మరియు తదితరులు పాల్గొన్నారు.