సిద్దిపేట జిల్లా : అక్టోబర్04, (హుస్నాబాద్ భార్గవాపురం నియోజకవర్గం / కోహెడ మండలం )కోహెడ మండలం వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన పిడిశెట్టి లక్ష్మి – భూమయ్య గారి 2వ సంతానమైన పిడిశెట్టి సంపత్ చిన్నప్పటినుండి చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారు. ప్రాథమిక విద్యాబ్యాసం కోహెడలో ఇంటర్ హుస్నాబాద్ మరియు డిగ్రీ కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాలలో పూర్తిచేసిన సంపత్ నిజాం కాలేజీలో తన పి.జి పూర్తిచేశారు బి.ఈడి పూర్తి చేసిన సంపత్ అనంతరం సీ ఇఐ ఎస్ ఆర్ యూజీసీ నెట్ లో ఆలిండియా 87 వ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ డి.కరుణాసాగర్ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రంలో Design of a mode selective Coupler for Conversion of Spatial Vector Mode అనే అంశం పై పరిశోధనలు జరిపినందుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. అంతే కాకుండా పిడిశెట్టి సంపత్ వరుసగా ట్రైబల్ వెల్ఫేర్ లో టీజీటీ – సైన్స్ , హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మరియు మైనారిటీ గురుకుల సొసైటీ లో ప్రిన్సిపాల్ గా మూడు ఉద్యోగాలు సాధించారు. పిడిశెట్టి సంపత్ ప్రస్తుతం తిమ్మాపూర్ లోని మానకొండూర్ మైనారిటీ గురుకుల ప్రిన్సిపాల్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు , గురువులకు సోదరులకు మరియు తనకు సహకరించిన మైనారిటీ సొసైటీ లోని అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు పిడిశెట్టి సంపత్ కృతఙ్ఞతలు తెలిపారు.