
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
జీవితంలో మంచి గోల్స్ పెట్టుకొని వాటిని సాధించే విధంగా కృషి చేయాలి
వీలైతే దేశానికి సేవ చేయండి.. కానీ దేశానికి భారం కాకూడదు
డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టడంలో యువతదే కీలక పాత్ర
మీ:: న్యూస్ ప్రతినిధి అశోక్ జహీరాబాద్: యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు. ఒక వ్యక్తి జీవితంలో మొదటి 25 సంవత్సరాలు చాలా కీలకం అని కష్టపడి చదివి గోల్స్ ను నెరవేర్చుకున్నట్లైతే జీవితం చాలా అందంగా ఉంటుందని మాదకద్రవ్యాల నిరోధక శాఖ డి.ఎస్.పి పుష్ప కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుట్కా సిగరెట్, వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చేదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు.విద్యార్థిని , విద్యార్థులుగా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని నెరవేర్చుకునే దిశగా కృషి చేయాలి అంతేగాని అనవసర చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు దేశానికి భారంగా మిగలకూడదన్నారు. భారత దేశ పౌరులుగా పుట్టడం మన అదృష్టమని, భారత పౌరులుగా దేశానికి ఏదోరకంగా ఉపయోగపడాలి అన్నారు. నూతన చుట్టాల గురించి అవగాహన కలిగి మంచి మార్గంలో నడవాలని యువతకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ కాశీనాథ్, జాగృతి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుభాష్ రెడ్డి, మహిళ ఎస్ ఐ హారిక మాస్టర్ మైండ్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్
Post Views: 55