సూర్యాపేట :దేశం లో సంచలనం సృష్టించిన కలకత్తా ట్రైనీ డాక్టర్ మృతికి కారణమైన అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఐ ఎం ఎ సూర్యాపేట పూర్వ కార్యదర్శి ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ చంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం నాడు సిఐటియు జిల్లా కమిటీ ఆద్వర్యం లో కలకత్తా ట్రైనీ డాక్టర్ మృతికి కారణమైన అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం వీ యన్ భవన్ లో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికిఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సవింత్సరాలు దాటిన భారత దేశంలో మహిళల పై రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయాని అయన అవేదన వ్యక్తం చేశారు.సుప్రీం కోర్టు సుమోట గా కేసు తీసుకునే వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఊగిసలాట ఆడిందని అయన విమర్శించారు.దేశం లో వైద్యులకే కాదు, సామాన్యులను మొదలు కోని కవులు,కళాకారులు, అభ్యుదయ రచయితలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.మెడికో చదువు తున్న విద్యార్థులకు మెడికల్ కళాశాల లో సరైన రక్షణ లేదనీ, ట్రైనీ డాక్టర్ లకు సరైన విశ్రాంతి రూమ్స్ కూడా ఉండవని అన్నారు. చనిపోయిన ట్రైనీ డాక్టర్ ఎఫ్ ఐ ఆర్ చేయకుండా శవ పరీక్ష చేశారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.కాలేజి ప్రిన్స్ పాల్ పోలిస్ కేసు పెట్టకుండానే శవ పరీక్ష చేసీ ట్రైనీ డాక్టర్ తండ్రి వచ్చిన మూడు గంటల ఆలస్యంగా శవాన్ని చూడనిచ్చారని రమేష్ చంద్ర ఆరోపించారు.కరోనా కష్ట కాలంలో ప్రజలకు సేవలు అందించన డాక్టర్లకు కనీసం రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర రక్షణ చట్టం తేవాలని, అయన డిమాండ్ చేశారు. తెలంగాణరైతు సంఘo జిల్లా అద్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారము లోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.నిర్భయ చట్టం లాంటి ఎన్ని చట్టాలు ఉన్న ఫలితం లేదన్నారు.నేడు కేంద్రం లో ఉన్న బీజేపీ మూల సిద్ధాంతం లోనే మహిళలు అంటే హీనంగా చూసే సంస్కృతి ఉందన్నారు.ప్రభుత్వ
మెడికల్ కళాశాల విద్యార్థి సంఘ నాయకులు డాక్టరు పృథ్వి, అజయ్ , సాహెబాజ్ మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ మృతికి నిరసనగా నిరసన కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు ఆదేశాను సారం తాత్కాలికంగా వాయిదా వేశామని
డాక్టరు కుటుంబానికి న్యాయం జరగక పోతే తిరిగి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతుందన్నారు.
డాక్టరు మృతి కి అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్ష వేయాలి అన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. రాములు మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాతనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మృతి రాలి కుటుంభానికి 5కోట్లు రూపాయలు ఎక్ష్ గ్రెషియా ఇవ్వాలని, కుటుంబము లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు.
తెలంగాణవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టి పల్లి సైదులు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,
శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాక లక్ష్మీ, డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి జే. నర్సింహా రావు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్ మృతితో నైన మహిళా రక్షణ చట్టం తేవాలని వారు కోరారు.
ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం. సైదమ్మ, వైద్య విద్యార్థి సంఘాల నాయకులు ఎస్ కె
సజాధ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం చట్టం తెచ్చే వరకు అన్నీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేయాలి అని అన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం రాంబాబు అధ్యక్ష వహించగా సీఐటీయూ నాయకులు ఎం,శేఖర్, అంగన్వాడి వర్కర్స్ అండ్ టీచర్స్ యునియన్ జిల్లా కార్యదర్శి బొలిషెట్టి భాస్కరమ్మ, నాయకురాలుమంజుల, వల్లపు దాసుసాయి కుమార్, కోడిఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.