యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండలం, లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన పర్రెపాటి వెంకటేష్ (27) బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్ వారి సొంత వ్యవసాయ క్షేత్రంలోని ఉన్న బావిలో నీరు అధికంగా ఉండి, మోటారు మునిగిపోతుండడంతో బకెట్ సహాయంతో నీటిని బయటకు పోస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఫిడ్స్ రావడంతో బావిలోకి మ్రొగ్గిపడి మరణించాడు.