వక్ఫ్ బోర్డు( పీర్ల కొట్టం భూమి) భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు
మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య::వక్ఫ్ బోర్డు( పీర్ల కొట్టం భూమి) భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు, వక్ఫ్ బోర్డు ( పీర్ల కొట్టం భూమి) భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఒక బోర్డ్ తాసిల్దార్ అసుదుల్లా ఖాన్ అన్నారు మంగళవారం మండల పరిధిలోని చిల్పకుంట్లలో సర్వే నంబర్ 405, 463 లో గల 10 ఎకరాల 6 గంటల వక్ఫ్ బోర్డ్ భూమిని గుర్తించి సర్వే చేసి హద్దులు నిర్ణయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎడి సర్వేయర్ వెంకటరెడ్డి ,వక్ఫ్ బోర్డు రెంటల్ కలెక్టర్ పటాన్ జాని, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్ కె జాంగిర్ తదితరులు పాల్గొన్నారు