ఫుడ్ పాయిజన్ కి కారణమైన వారిని శిక్షించాలి

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ఫుడ్ పాయిజన్ కి కారణమైన వారిని శిక్షించాలి

విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి

ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి

ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం

      

      ఎర్ర అఖిల్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి

 

 సూర్య పేట్ జిల్లా ::మీ న్యూస్ ప్రతినిధి :: ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఫుడ్ పాయిజన్ ఘటనలు అని పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు. ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని, మధ్యాహ్న భోజన పాయిజన్ కి కారకులను శిక్షించాలని, రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో అనేకమంది విద్యార్థులు అనారోగ్యాల గురైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని *ప్రభుత్వ పాఠశాలల బంద్ ను పీడీఎస్యు అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ* త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్ లలో,గురుకుల పాఠశాలలో చదువును కొనసాగిస్తున్నారు అన్నారు.వీరికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తున్నం విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ర్యాంకులు తీసుకురావాలని ప్రభుత్వాలు హామీలను ఇస్తున్నారు కానీ అవి ఏ ఒక్కటి అమలు కావడం లేదు అన్నారు.విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం లోపం ఉండడం వల్ల కలుషితం అయ్యి అనేకమంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యలో ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలలో రెండుసార్లు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఫుట్పాయిజన్ కావడం అనేది అది కూడా అధికారుల పర్యవేక్షణ లోపం, ఇది వాళ్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని అని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిపోతున్న ఇప్పటివరకు విద్యా శాఖ మంత్రి నియమించలేదు అన్నారు.విద్యా సంస్థలపైన పర్యవేక్షణ లేదు అన్నారు. చాలా ఎంఈఓ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు అసలే లేవు అన్నారు.విద్యార్దుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతోనే ప్రజల్ని పక్కదో పటించడం అనేది సరైనది కాదని అన్నారు.అదే విధంగా ప్రయివేటు,కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తు ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షణ చేయని సూర్యాపేట విద్యాశాఖ అధికారిని టర్మినేట్ చేయాలన్నారు.తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి, ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఫుడ్ పాయిజన్ కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పీడీఎస్యు ఆధ్వర్యంలో మంత్రుల, ఎమ్మెల్యే ల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు సూరం విజయ్, వినయ్, మాతంగి విజయ్, వంటికొమ్ము నగేష్,వివేక్, సాయి, శ్రీకాంత్, రాజు, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.