మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్. మీ:: న్యూస్ ప్రతినిధి :తాండూరు అన్ని దానాలకన్న అన్నదానం గోప్పదని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్ తెలిపారు . బుధవారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ లో కొలువు దీరిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్.వర్త్య విట్టల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వర్త్య విటల్ నాయక్ మాట్లాడుతూ అమావాస్య రోజు అన్నపూర్ణ దేవిని కోలిస్తే దనధాన్యాలకు లోటు ఉండదని తెలిపారు.గత 23 నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకొని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు కుమ్మరి నర్సింలునుఅభినందించారు.అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతినెల అమావాస్య రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా భక్తులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తమకు తోచిన సహాయ సహకారాలు కూడా అందజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్ కూతురు వర్త్య ప్రశాంతి ,వర్త్య రవికుమార్,అలయ కమిటీ గౌర్వ అధ్యక్షులు వర్థ్య విఠల్ నాయక్ అధ్యక్షులు బి.నరేష్,ఉపాధ్యక్షులు నవీన్ కంఠం,ప్రధాన కార్యదర్శి కే. వేణు గోపాల్,ఉప కార్యదర్శి కే.నర్సింలు,కోశాధికారి ఈ.అంజిల్లాయ్య, టీ రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జే. సుధాకర్,ఎస్. సుధాకర్, పట్నం రమేష్ ,రాజేష్, కే.కృష్ణ,నగప్ప,వెంకటప్ప,బెజ్జు రమేష్,పాపయ్య,ఆనంద్ ,యాదగిరి రెడ్డి,దీలిప్ సింగ్ ఠాకూర్,ఆలయ అర్చకులు చందుస్వామి,భక్తులు తదితరులు పాల్గొన్నారు