ప్రజా పోరాటాల రథసారథి సిపిఐ (ఎం)  భవిష్యత్ కమ్యూనిస్టులదే…

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

ప్రజా పోరాటాల రథసారథి సిపిఐ (ఎం)

 భవిష్యత్ కమ్యూనిస్టులదే…

 పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం….

 సిపిఎంలో 5 కుటుంబాలు చేరిక….

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మీ:: న్యూస్ ప్రతినిధి 

 మోతే : ప్రజా పోరాటాల రథసారథి సిపిఎం అని, భవిష్యత్తులో రానున్న కాలమంతా కమ్యూనిస్టులు అదేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం మోతే మండల కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రామ్మోహన్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసిసిపిఎం పార్టీ, ప్రజా సంఘాల్లో5 కుటుంబాలు చేరారు. వారికిఆయనసిపిఎం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతే మండలంలో సిపిఐ (ఎం) నిర్వహిస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై అనేకమంది సిపిఐ (ఎం) పార్టీలో చేరడం సంతోషదాయకం అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకుపార్టీలో సుమచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది సిపిఐ (ఎం) మాత్రమే అని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే అనేక పోరాటాలలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో మోతే గ్రామానికి చెందిన కోరదల కృష్ణ, మేకల ఉపేందర్, అండం వెంకటేశ్వర్లు, నాగయ్య గూడెం గ్రామానికి చెందిన బొర్రాజు వెంకన్న, శ్రీనులు ఉన్నారు.ఈ కార్యక్రమంలోసిపిఎం మండలకార్యదర్శిములుకూరి గోపాల్ రెడ్డి,సిపిఎం మండల కమిటీ సభ్యులుగుంట గాని ఏసు, చర్లపల్లి మల్లయ్య, సిపిఎం గ్రామ కార్యదర్శిదోసపాటి శ్రీనివాస్,వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలుజంపాల స్వరాజ్యం, సిపిఎం మండల నాయకులుఏల్ల బోయిన రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.