తెలంగాణలో జిల్లాల వారీగా వర్గీకరణ చేసి

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

తెలంగాణలో జిల్లాల వారీగా వర్గీకరణ చేసి

మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి 

డాక్టర్ పిడమర్తి రవి 

  మీ న్యూస్ ప్రతినిధి కొల రవీందర్ గౌడ్ ::సూర్యాపేటకు చేరుకున్న మాదిగల మేలుకొలుపు యాత్ర తెలంగాణలో జిల్లాల వారిగా వర్గీకరణ చేసి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి అన్నారు. మాదిగ లకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మాదిగ జేఏసి ఛైర్మన్ పిరమర్తి రవి నాయకత్వంలో చేపట్టిన మాదిగల మేలుకొలుపు యాత్ర మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తా కు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 1994 లో ఎమ్మార్పీఎస్ డిమాండ్ ప్రకారం మాదిగలకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మాదిగ,మాదిగ ఉపకులాలకు ఏడు శాతం కాకుండా 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మాల, మాదిగల మధ్య సంఖ్యా బేధం ఉందని జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని2011 జనాభా లెక్కల ప్రకారం, 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కాకుండా, జిల్లాలో సంఖ్యాపరంగా తేడా వస్తే అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించి వర్గీకరణ చేయాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మాదిగ వాడ తిరిగి వర్గీకరణ పై చైతన్యం కల్పిస్తామని చెప్పారు. ఈ మాదిగల మేలుకొలుపు యాత్ర సూర్యాపేట నుంచి సోమవారం సాయంత్రం ఖమ్మం, మంగళవారం వరంగల్ కు చేరుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు, నాయకులు పిడమర్తి వెంకటయ్య, ఆరె నాగరాజు, మాదిగ జేఏసీ యూత్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సంజయ్, యువజన రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రవణ్, ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైసా ఉపేందర్, మీసాల మహేష్, దేవరకొండ నరేష్, నక్క మహేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండ్లపల్లి సుధాకర్, బండారి నరేందర్, పడిదల శంకర్, నెమ్మాది ప్రభు తదితరులు పాల్గొన్నారు