మీ న్యూస్ ప్రతినిధి::మోతె:మండల పరిధిలోని సిరికొండ గ్రామంలోని శివాలయంలో శివ నామస్వరంతో శివాలయాలు మారుమోగాయి. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయం నుండి బారెలు తీరి శివయ్యను దర్శించుకున్నారు. అర్చకులు హరీష్ శర్మ ఆధ్వర్యంలో సిరికొండ గ్రామంలోని శివాలయంలో శివరాత్రి పర్వదినాన ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు తీర్థప్రసాదాలు భక్తుల స్పందించారు. కోరిన వెంటనే వరమిచ్చే సిరికొండ శివయ్యను భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిరికొండ సొసైటీ బ్యాంక్ చైర్మన్ కొండపల్లి వెంకటరెడ్డి నూకల ఉపేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు.