గొట్ల పల్లి లో ఉచిత వైద్య శిబిరం 

Uncategorized ఆరోగ్యం తాండూర్ పేద్దేమూల్ రాజాకియం వికారాబాద్

గొట్ల పల్లి లో ఉచిత వైద్య శిబిరం 

—ఎల్ఎన్ఆర్ యువ సేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

 

 –వికారాబాద్ మహావీర్ హాస్పటల్ సిబ్బంది 

 

 

 —పెద్దేమూల్ జడ్పిటిసి ధారాసింగ్ 

 కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్

 

మీ: న్యూస్ ప్రతినిధి పెద్దేమల్ మండలం గొట్లపల్లి గ్రామంలో LNR యువ సేన ఆధ్వర్యంలో గొట్ల పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పెద్దేముల్ మండల్ మాజీ జెడ్పిటిసి దారసింగ్, ఉత్తం చందు LNR యువ సేన అధ్యక్షులు లొంక నర్సిములు, ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై  తమ తమ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసుకొని  సంబంధిత మందులు తీసుకున్నారు గ్రామంలో మొట్టమొదటిసారిగా  ఎల్ ఎన్ ఆర్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వికారాబాద్ చెందిన మహావీర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు,  ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులు తమకు సంబంధిత వ్యాధులకు బిపి  షుగర్ థైరాయిడ్ వంటి వ్యాధులకు పరీక్షలు చేయించుకొని  సంబంధిత మందులు తీసుకున్నారు అలాగే మరికొంతమంది  కంటి ఆపరేషన్ కోసం చూయించుకున్నారు వారికి కంటి ఆపరేషన్ తీసుకు వెళ్లడానికి ఎల్ఎన్ఆర్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ చేయిస్తామని తెలిపారు 

 

పేద్దేమూల్  మాజీ జడ్పిటిసి ధారాసింగ్

మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి ఉచిత వైద్య శిబిరం పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది మరియు మున్ముందు ఎల్ఎన్ఆర్ యువసేన ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరడం జరిగింది.

LNR యువ సేన అధ్యక్షులు లొంక నర్సింలు

మాట్లాడుతూ గొట్లపల్లి గ్రామ ప్రజలు కోరిక మేరకు ఈరోజు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది, ఈ ఉచిత వైద్య శిబిరంలో బిపి షుగర్ థైరాయిడ్ గుండె కు వంటి సంబంధించిన వ్యాధులు వారు టెస్టులు చేయించుకున్నారు, మరి కొంతమంది కీ కంటి ఆపరేషన్ పరీక్షలు చేయించుకున్నారు, కంటి ఆపరేషన్ సంబంధించిన బాధితులకు LNR యువ సేన వారి ఆధ్వర్యంలో బాధ్యత తీసుకుంటామని చెప్పారు.ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి దారాసింగ్, ఉత్తం చంద్, లొంక నర్సింలు , వికారాబాద్ మహావీర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది, ఎల్లారెడ్డి, కుమార్ సెట్ , నరేందర్ సెట్, లొంక రాములు,పేద్దేమూల్ మండలం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.