మాటలు కోటలు దాటుతున్న చేతలు మాత్రం గడవ దాటని వైనం క్షేత్రస్థాయిలో ఆవిధ్య తడుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 15 వాటికి మూడు విడతలుగా 100% రుణమాఫీ చేశామని గొప్పలు చెబుతూ ఉత్సవాల పేరిట ప్రచార ఆర్మా టంతో అదరగొడుతూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రచారం కోసం వినియోగిస్తూ అంకెల గారడితో మాటల తూటాలు పేలు స్తుంటే, గ్రామీణ ప్రాంత రుణగ్రహితులైన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా దర్శనమిస్తుంది. మునగాల మండల వ్యాప్తంగా వ్యవసాయ సేద్యంపైనే ఆధారపడి బతుకు వెల్లదీస్తున్న రైతులు ‘రుణ సాయం తీసుకుని వ్యవసాయ సేద్యంపై ఆ రుణాన్ని ఖర్చు పెట్టగా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ముడల వ్యాప్తంగా 30 శాతం మందికి మాత్రమే రైతు రుణమాఫీ వర్ణించింది. ఇంకా 70 శాతం మందికి రైతు రుణమాపి వర్తించకపోవడంతో, బ్యాంకుల్లో మళ్ళీ రుణాలు రాకపోవడంతో మండల వ్యాప్తంగా ఉన్న రైతాంగం తమ వ్యవసాయ పనులు నిలుపుదల చేసుకొని వ్యవసాయ శాఖ కార్యాలయం బ్యాంకు అధికారుల చుట్టూ నిత్యం చెప్పలు అరిగేలా తిరగడమే తమ పని అని అన్నారు…