మీ న్యూస్ ప్రతినిధి మోతేఫిబ్రవరి 8:మోతేమండలంలోని రావిపహాడ్ గ్రామానికి చెందిన కుంచం మల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని *మాజీ జడ్పిటిసి పందిళ్ళపల్లి పుల్లారావు* శనివారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మల్లయ్య లేనిలోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా 5 వేల రూపాయలను అందజేశారు. ఆయన వెంట కాకి మోహిన్ రెడ్డి , కాకి సురేందర్ రెడ్డి , కోట ఉపేందర్ రెడ్డి, కోడి గంగయ్య , పొడపంగి యలమంచి, సోమిరెడ్డి కర్ణాకర్ రెడ్డి, పగిల్లా ఉప్పాలి , రేవంత్ , కోట మధుసూదన్ రెడ్డి, కోట వెంకట్ రెడ్డి , బత్తిని నరేష్ , శ్రీను గోపగాని, కుంచం యల్లయ్య, పగిల్ల మాల్సూర్, పొడపంగి గురువయ్యా , వెంకన్న తదితరులు ఉన్నారు.