శేకపూర్ గ్రామంలోని షేక్ శహబొద్దిన్ 674 వ జాతరను పురస్కరించుకుని శుక్రవారం తమ బృందంతో కలిసి చోటే పిరా నుంచి అనేగుంట చౌరస్తా వరకు పూర్తిస్థాయిలో అద్వనమైన రోడ్డును పరిశీలించి ఉర్స్ కు వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు, ఉర్స్ కమిటీ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ డా చంద్రశేఖర్ హాజరత్ షేక్ శహబుద్దిన్ దర్గాను దర్శించుకున్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్-ఉన్-నబి పర్వదినం ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాతర కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ చష్మోద్దీన్, తాజా మాజీ ఎంపిటీసి నారాయణ్ గౌడ్, మొహమ్మద్ అరిఫ్ అలీ, షెక్ అలీ, జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు, న్యాల్కల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉగ్గేల్లి రాములు యాదవ్, మాజీ వైస్ చైర్మన్ ఖాజా మియా, జె జె కన్స్ ట్రాక్షన్ అధినేత మీర్ జావిద్ అలీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఆర్షద్ అలీ, మొహమ్మద్ గౌస్, రాకేష్ పబ్బతి, నరేష్ గౌడ్, షేక్ అలీ, ఖుర్షీద్ మియా, మొహమ్మద్ జామిర్, ఇనాయత్ అలీ, మాజీ వైస్ ఎంపిపి షాకిర్ అలీ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.