ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలి.
సిపిఐ(ఎం) వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్
మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూర రవీందర్ గౌడ్::సూర్యాపేట టౌన్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని 8వ వార్డులోజరిగినసిపిఎం పార్టీ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి9 నెలలు అవుతున్న ఇచ్చిన వాగ్దానాన్ని నేటికీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు.100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ నేటికీ పూర్తి చేయలేకపోయారని, అనేకమంది అర్హత కలిగిన రైతులు మాకు కాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేద వ్యక్తం చేశారు.పేదలకు ఇస్తామన్న హామీలు అమలు చేయకుంటే ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న అప్రజా స్వామిక విధానాలను తిప్పి కొట్టాలని కోరారు. దేశ భవిష్యత్తు ను మార్చేది మార్క్సిజమేనని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రజలు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితోపాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం పార్టీ 8వ వార్డు శాఖ కార్యదర్శిగా టేకుల సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మరిపెళ్లి వెంకన్న, గోరుగంటి రమేష్, మరి పెళ్లి రేణుక, బత్తినివెంకన్న తదితరులు పాల్గొన్నారు.