తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి 

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి 

జహీరాబాద్ నుండి అల్గోల్ వెళ్ళే రహదారి తాత్కాలిక మరమ్మత్తు పనులు

మీ:: న్యూస్ ప్రతినిధి ఎండీ ఖలీల్ ::జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అల్గోల్ వెళ్ళే రహదారి గుంతలు పడడంతో గ్రామస్తులు గతవారం రోజుల క్రితం ధర్నా చెయ్యడంతో, విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి అక్కడికి చేరుకుని వెంటనే మరమ్మత్తులు చెయిస్తానని చెప్పడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు, చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుని మరమ్మత్తుల పనులను శనివారం రోజున పరిశీలించారు.తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టడం పట్ల గ్రామస్తులు,ప్రయాణికులు హర్ష వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో TGIDC మాజీ చైర్మన్ మహ్మద్ తన్వీర్ గారు,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ ,జహీరాబాద్ మండల అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు,మాజీ జెడ్పీటీసీలు,మాజీ యంపిపి లు,మాజీ యంపిటిసి లు తాజా మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్,ఎన్.యస్.యూఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.