schedule Wednesday, June 17, 2026

బాలుడిపై వీధికుక్కల దాడి

calendar_today February 13, 2024
person meenewstelugu
బాలుడిపై వీధికుక్కల దాడి
* తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తర లింపు
* పెద్దేముల్ మండల కేంద్రంలో వీధి కుక్కల విహారం..
* తమ పిల్లలకు రక్షణ ఏదీ.?
* వీధి కుక్కల నియంత్రణ చేయాలని గ్రామస్తుల డిమాండ్
దీక్షతెలుగు న్యూస్ , తాండూరు :
ఆరేళ్ల బాలుడిపై కుక్కల దాడి చేసి గాయపరిచిన సంఘటన పెద్దేముల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది..పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన కోళ్ల శ్రీనివాస్ కుమారుడు అబ్నేర్ ఆరేళ్ల బాలుడు తమ ఇంటికి సమిపంలో ఉన్న కిరాణా దుకాణనికి వెళ్లగా మార్గమధ్యలో ఉన్న వీధికుక్కల గుంపు అకస్మాత్తుగా బాలుడిపై దాడికీ పల్పడుతుండగ బాలుడి అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకొని బాలుడిని రక్షించి తాండూరు పట్టణంలోని మాత శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని కుటుంబీకులు తెలిపారు. వీధికుక్కల నియంత్రణ కొసం పంచాయతి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాలుడు తండ్రి గోపాల్ కోరారు.గ్రామంలో మాంస వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పడవేయడంతో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా గ్రామంలో తిరుగుతున్నయని కుక్కలను ఆదమరిస్తే అంతే సంగతి అని..ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు గ్రామంలో వీధి కుక్కలు నివారణ చర్యలు చేపట్టి, తమ పిల్లలకు రక్షణ కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.