ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
మొక్క నాటుదాం… చెట్టుగా పెంచుదాం…
పచ్చని భవిష్యత్‌కు బాటలు వేద్దాం!
ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం
మీ న్యూస్ ప్రతినిధి తాండూర్:::పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 27 లో వాసవి కాలనీలో ఇంటింటికి మొక్కలు పంపే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వార్డ్ కౌన్సిలర్ స్వరూప మల్లేశం కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేస్తూ మొక్కలు నాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వాసవి కాలనీ లో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేసిన కౌన్సిలర్ అనంతరం మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. వార్డ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.వాన ఉత్సవం కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ వార్డు ఇంచార్జ్ మెహరాజ్, రవితేజ సాగర్, ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు.