తాండూరు ఎం సి హెచ్ లో వైద్యం అందక మరణానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
calendar_today
October 5, 2026
person
meenewstelugu
మాత శిశు సంక్షేమ ఆస్పత్రిలో నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపర్డెంట్ కు వినతి
బీసీ జేఏసీ నాయకులు భాను కుమార్, అంబేద్కర్ తాండూర్ డివిజన్ సెక్రెటరీ బుడిగ జంగం వెంకటేష్
మీ న్యూస్ ప్రతినిధి:::తాండూరు మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బిసి జేఏసీ నాయకులు భాను కుమార్, అంబేద్కర్ తాండూర్ డివిజన్ సెక్రెటరీ బుడిగ జంగం వెంకటేష్ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భాను, వెంకటేష్ మాట్లాడుతూ తాండూరులో గత మూడు రోజులుగా ఎం సి హెచ్ లో కొనసాగుతున్న మరణాలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుకే తల్లి బిడ్డ, ఆరు సంవత్సరాల చిన్నారి మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు లక్షల్లో జీతాలు తీసుకుంటూ సరైన సమయానికి ఆసుపత్రికి రాకుండా ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల పట్ల సరైన చికిత్స అందించడం లేదనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే పేదల చావుకు డాక్టర్లు కారణం అవుతున్నారన్నారు. జూనియర్ డాక్టర్లు కూడా సమయపాలన పాటించడం లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూర్ లో కొనసాగుతున్న మరణాల ను తగ్గించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎం సి హెచ్ ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, రాము గౌడ్, మహేష్, బంటి తదితరులు పాల్గొన్నారు.