schedule Thursday, October 22, 2026

కంపు కంపు 

calendar_today September 22, 2026
person meenewstelugu
కంపు కంపు 
  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పిపి యూనిట్ నర్సింగ్ కళాశాల

నర్సింగ్ కళాశాల భవనం

ఏరులై పారుతున్న డ్రైనేజీ నీర

ఎక్కడి చెత్త అక్కడ ఎక్కడ మురుగునీరు అక్కడే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని

త్రివ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 

నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు

మీ న్యూస్ ప్రతినిధి తాండూర్::పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే ప్రభుత్వ అధికారులు తమ ప్రభుత్వ ఆసుపత్రి వీపీ యూనిట్ ఆవరణలో డ్రైనేజ్ లీక్ అవుతున్నా చర్యలు లేవని, అదే భవనంలో ఉన్న సర్సింగ్ కళాశాలలో కూడా వసతులు లేవని ఆ భవనం మొత్తం కంపు కంపుగా మారిందని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి పీపీ యూనిట్ ఆవరణలో కొన్ని రోజుల నుంచి డ్రైనేజ్ వాటర్ ఏరులై పారుతుంది. మంగళవారం పారిన డ్రైనేజ్ నీటితో ఆ ప్రాంగణమంతా మురికి కుంట గా మారింది. నర్సింగ్ కళాశాల, టీబీ చికిత్స ఆస్పత్రి ఆర్క-డనే ఉండడం అక్కడికి వచ్చే వారంతా ఆ కంపుకు ముక్కుని మూసుకొని నడవాల్సిందే. వర్షాలు కురవడం ఒక వైపు అయితే డ్రైనేజ్ పూర్తిగా కుంటగా వరదగా మారడంతో అక్కడ వెళ్లాలంటేనే అందరు భయపడుతున్నారు జి తాండూర్ మున్సిపల్ 28వ వార్డు పరిధిలోగల సందర్శించగా ఎక్కడి చెత్త అక్కడ ఎక్కడ మురుగునీరు అక్కడే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు సిబ్బంది రోగులు ప్రజలు అందరు కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలో ప్రస్తుత పరిస్థితి నెలకొంది తాండూరు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు 28వ వార్డు కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ కుమార్ దోమ కృష్ణ చిదిరి ప్రకాష్ వడ్డే సాయిలు సతీష్ కుమార్ బబ్లు బిజెపి నాయకులు పరిస్థితుల గురించి ఇన్చార్జి సూపర్డెంట్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాను. యుద్ధ ప్రాతిపదికన శాశ్వత పరిష్కారం మురుగునీరు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి సుచి శుభ్రత పాటించాలని కోరడం జరిగింది రోగులు జబ్బులు నయం చేసుకోవడానికి వస్తారు కానీ ఇక్కడ రోగుల వెంబడి వచ్చే ప్రజలకు కూడా రోగాలు వచ్చే విధంగా మురుగునీరు డ్రైనేజీ చెత్తాచెదారం వీటి నుంచి వాసన దోమలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని యుద్ధ ప్రాధిపతిగా పనులు చేపట్టాలని కోరారు. తక్షణమే చర్యలు చేపట్ట లేనియెడల బిజెపి పార్టీ భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.