schedule Friday, September 11, 2026

బీజేపీ జిల్లా అధ్యక్షుడు కు ఘన సన్మానం 

calendar_today August 10, 2026
person meenewstelugu
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కు ఘన సన్మానం 

యు రమేష్ కుమార్ కుబీజేపీ అధ్యక్షుడు శివకుమార్ సన్మానం 

జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యు రమేష్ కుమార్ 

మాజీ సర్పంచ్ బిజెపి మండల అధ్యక్షుడు శివకుమార్ 

తాండూరు ఆగస్టు 9 మీ న్యూస్ ప్రతినిధి::: భారతీయ జనతా పార్టీ (బీజేపీ )జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యు రమేష్ కుమార్ ను యాలాల మండల బీజేపీ అధ్యక్షుడు శివకుమార్,పలువురు బిజెపి కార్యకర్తలతో కలిసి ఘనంగా సన్మానించారు. ఆదివారం రోజు తాండూరు పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లిన బిజెపి మండల అధ్యక్షుడు శివకుమార్ పలువురు కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ ను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా సముచిత స్థానం ఉంటుందని గుర్తు చేశారు. రమేష్ కుమార్ పార్టీ కోసం చేసిన ప్రతిఫలం నేడు లభించింది అని చెప్పారు. జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికవ్వడం యువతలో మరింత జోష్ నింపిందన్నారు. రానున్న ఎన్నికల నాటికి బిజెపి పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి,మాజీ అధ్యక్షుడు యాదగిరి, ఉప సర్పంచలు వెంకటేశం, మద్దూర్ శంకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అరుణ్, ఎం రమేష్ మండలానికి చెందిన బిజెపి కార్యకర్తలు అభిమానులు ఉన్నారు.