schedule Saturday, June 13, 2026

బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

calendar_today June 5, 2025
person meenewstelugu

బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

ప్రజలతో బయట పడడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు  

యాలాల 4 జూన్ మీ న్యూస్ ప్రతినిధి:-ప్రయాణంలో ప్రభుత్వ ఆర్టీసీ బస్సు యొక్క స్టీరింగ్ రాడ్ బోల్డ్ విరగడంతో అదుపుతప్పిన బస్సును డ్రైవర్ తన చాకచక్యంతో బస్సును పంట పొలాలలోకి తీసుకువెళ్లి నిల్పటంతో 

పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలకు వెళ్తే.. బుధవారం ఆర్టీసీ బస్సు (29 జెడ్ 1892) 75 మంది ప్రయాణికులతో యాలాల మండలంలోని కొత్తూరు నుంచి తాండూరు వైపుకు వస్తుంది ఈ క్రమంలో యాలాల మండల గొనుర్ గ్రామ శివారులో బస్సు స్టీరింగ్ రాడ్ బోల్ట్ , విరిగి ఒక్కసారిగా కమాన్ పట్టి విరగడంతో బస్సు పక్కకు ఒరిగింది. దీంతో ప్రయాణికులుభయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాల్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి బస్సును నెమ్మదిగా పంటపొలాలకు తీసుకుని వెళ్లి నిలబెట్టారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్ వెంటనే స్పందించడంతో ఆయన కు అభినందనలు తెలిపారు. మరో బస్సు రాగానే ప్రయాణికులను తరలించారు. డ్రైవర్ వల్లతాము ప్రాణాల నుంచి బయటపడ్డామని పలువురు డ్రైవర్ ను అభినందించారు. పాత బస్సులు కావడం ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ,కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని పలువురు పేర్కొన్నారు.