schedule Saturday, June 13, 2026

జిల్లా పోలీసు అడ్మిన్ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ రెడ్డి

calendar_today May 29, 2025
person meenewstelugu

జిల్లా పోలీసు అడ్మిన్ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ రెడ్డి

•:-రవీందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ 

:-బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పి నాగేశ్వరరావు ని ఘనంగా సన్మానించిన ఎస్పీ

మీ న్యూస్ ప్రతినిధి 9640659560 మే 28:-సూర్యాపేట జిల్లా పోలీసు అడ్మిన్ అదనపు ఎస్పి గా పనిచేస్తున్న నాగేశ్వరరావు బదిలీ ఆయన విషయం తెలిసినదే. ఆయన స్థానంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి అదనపు ఎస్పి అడ్మిన్ గా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా ఎస్పి కి కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి ఉత్తమమైన సేవలు అందించాలని కోరారు.

బదిలీపై వెళ్తున్న అదనపు ఎస్పి నాగేశ్వరావు గారిని ఘనంగా సన్మానించినారు. దీర్ఘకాలం జిల్లా పోలీస్ శాఖలో సేవలు అందించినందుకు ఎస్పీ నాగేశ్వరరావు ను అభినందించారు.