schedule Saturday, June 13, 2026

వినియోగదారులకు చట్టం ద్వారా షోరూం పై చర్యలు తీసుకోవాలి.

calendar_today April 30, 2025
person meenewstelugu

వినియోగదారులకు చట్టం ద్వారా షోరూం పై చర్యలు తీసుకోవాలి

 

⏩::6 నెలలు గడిచినా వాహనాన్ని రిపేర్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు

 

మీ న్యూస్ ప్రతినిధి::కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ద్విచక్ర వాహనము హోండా యూనిక్రాన్ వాహనము రిపేర్ కు రావడంతో దానిని సరిచేయాలని షోరూంకు ఆశ్రయిస్తే 6 నెలలు గడిచినా కూడా నా యొక్క వాహనాన్ని రిపేర్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలాంటి షోరూంపై చర్యలు తీసుకోవాలని, వాహన బాధితుడు వెంకట్ తన ఆవేదనను మీడియాతో తెలిపారు. వినియోగదారులకు చట్టంపై షోరూంపై కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు వివరాల్లోకెళ్తే..పెళ్లి కోసం

పాత తాండూర్ కు చెందిన వెంకట్ అనే వ్యక్తి గత ఆరు నెలల కిందట పట్టణంలోని వైష్ణవి హోండా షోరూం నందు ద్విచక్ర వాహనం హోండా యునిక్రాన్ ను లక్ష పై గా పెట్టి కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. కొనుగోలు చేసిన కొన్ని రోజులకే తన వాహనము రిపేరుకు రావడం జరిగింది దీంతో హోండా షోరూమ్ లకు తన వాహనమును సర్వీస్ చేయాలని సంప్రదించినట్లుగా తెలిపారు అయితే ఆరు నెలలు అయినా కూడా తన వాహనాన్ని పూర్తిస్థాయిలో రిపేరు చేయక తన వద్దని డబ్బులు తీసుకొని ప్రాబ్లం ఉంది టైం పడుతుంది అని చెప్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారని తన ఆవేదనను వెళ్ళకు వచ్చారు ఇలాంటి షోరూం నిర్వాహకులపై వినియోగదారుల హక్కు చట్టం ప్రకారం ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.