schedule Wednesday, July 29, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జైలు శిక్షతోపాటు పలువురికి జరిమనా

calendar_today April 21, 2025
person meenewstelugu

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు జైలు శిక్షతోపాటు పలువురికి జరిమనా

⏩::సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

మీ న్యూస్ ప్రతినిధి::త కొన్ని రోజులుగా ఎస్పీ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని ఈరోజు కోర్టు నందు హాజరు పరచగా నలుగురికి జైలు శిక్ష రూ.2000జరిమానా, తొమ్మిది మందికి రూ. 9000 జరిమానా విధిస్తూ సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బి.వి.రమణ తీర్పు చెప్పినట్లు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు.ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో పలు చౌరస్తాల్లో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.13 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం కోర్టులో హాజరు హాజరుపరచగా నలుగురిలో ముగ్గురికి రెండు రోజులు జైలు శిక్ష, ఒక్కరికి ఒక్కరోజు జైలు శిక్ష రూ. 8,000 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ఎస్సై తెలిపారు.మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.