schedule Tuesday, July 28, 2026

ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

calendar_today March 13, 2025
person meenewstelugu

ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

 

మీ న్యూస్ మార్చి 13::మోతె - మండల పరిధిలోని నామవరం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జాతీయ నాణ్యత ప్రమాణాల టీం సభ్యులు గురువారం పరిశీలించారు. ఉప కేంద్రంలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, రోగులకి వైద్య సేవలు అందుతున్నాయో లేదు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో ప్రభుత్వం ఆస్పత్రుల పై విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఎన్ క్యూ ఏఎస్ ను ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. టీం సభ్యులు ఉప కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు వైద్యాధికారి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఐ కోటాచలం టీం సభ్యులు రాధిక, ఉమామహేశ్వరి, డాక్టర్ మందిరత్నం, డాక్టర్ వీరేంద్రనాథ్, డాక్టర్ అఖిల్, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.