schedule Wednesday, June 17, 2026

క్యాంపు కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

calendar_today March 8, 2025
person meenewstelugu

క్యాంపు కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

👉 ::మహీళలకు జ్ఞాపికాలు అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జహిరాబాద్ నియోజకవర్గ మహీళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

మీ న్యూస్ ప్రతినిధి::జహిరాబాద్ టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఆదేశాలతో క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మహీళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్ మహీళలతో కలిసి మహీళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజ ప్రభుత్వం అమలు చేసిన పథకాల లో మహిళకే ప్రథమ ప్రాధాన్యత నిస్తుందని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పాటు మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అలుపెరుగని కృషి చేస్తుందని అన్నారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగలలో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని, మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహీళలకు మహీళదీనోత్సవ జ్ఞాపికలను అందజేసి, శాలువా కప్పి సన్మానించారు