వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ నియామకం
calendar_today
March 8, 2025
person
meenewstelugu
వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ నియామకం
⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాప్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 6595 60
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 7::
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా సూర్యాపేటకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గట్టు శ్రీనివాస్ నియామకమయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్నికైన సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం తోపాటు పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.