schedule Wednesday, October 28, 2026

మన ఊరు మన బడికి స్పందన

calendar_today March 6, 2025
person meenewstelugu
మన ఊరు మన బడికి స్పందన

మన ఊరు మన బడికి స్పందన

   

⏩::మీన్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 659560

   

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 6::

పెన్ పహాడ్ :- మన ఊరు మన బడి అభివృద్ధికి దాతల సహకారం, స్పందన. మరువలేనిదని. ప్రధానోపాధ్యాయులు పండిగ నరసయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మామిడి వెంకన్న అన్నారు.గురువారం మండల పరిధిలోని దోసపహాడు యుపిఎస్ పాఠశాల విద్యార్థులకు త్రాగునీటికి. పైపులు వేయించడానికి సూర్యాపేట కరాటే మాస్టర్ సయ్యద్ రియాజ్ ఉద్దీన్ మూడు వేల రూపాయల నగదును ప్రధానోపాధ్యాయులు పిండిగ నరసయ్యకు అందజేశారు.ఈ సందర్భంగా పిండగ నరసయ్య మాట్లాడుతూ. మన ఊరు మనబడికి దాతలు ముందుకు రావడం అభినందనీయ అన్నారు. దోసపహాడు గ్రామములోని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కరాటే మాస్టర్ రియాజుద్దీన్ కు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రాయి కింద వెంకటేశ్వర్లు, A విజయ్ కుమార్, వై ఎంకన్న, ఎస్ విప్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.