schedule Wednesday, October 28, 2026

మార్చి 2 న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు  

calendar_today March 1, 2025
person meenewstelugu
మార్చి 2 న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు  

మార్చి 2 న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28::ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు మార్చి 2 న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యోగ గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగ పోటీల గురించి సాధకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నందున యోగా సాధకులు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఆసక్తి గలవారు సంప్రదించాలని తెలిపారు. యోగ పోటీల్లో ఎనిమిది సంవత్సరముల నుండి 60 సంవత్సరాల పైబడిన మహిళలు పురుషులు పాల్గొనవచ్చు అని తెలిపారు. 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు ఒక గ్రూపు, 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల వరకు, 30 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వరకు, 40 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు, ఆపై 60 సంవత్సరాల పైబడిన వారికి గ్రూప్ ల వారీగా యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొని "ప్రతిభ చూపిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు. ముఖ్య అతిథులుగా డి.ఎస్.పి రవి, సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, ఆయుష్ డిపార్ట్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ బి రామకృష్ణ, బ్రాహ్మణ కళ్యాణ మండపం అధ్యక్షులు చకిలం రాజేశ్వరరావు విచ్చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో యోగ సాధకులు భాస్కరాచారి, సంత్ నిరంకార సంస్థ అధ్యక్షురాలు కడారి సరళ, వి లింగయ్య, గోరంట్ల శ్రీనివాస్, , కట్ట. మమత ,సుధాకర్, సిహెచ్ సుజాత, కే శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.