మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 23::మోతే మండలం సిరికొండ గ్రామంలో మిర్చి పంట కు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా లో చోటు చేసుకుంది స్థానికులు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... జిల్లాలోని మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన చేగొండి గణేష్.38. తన భార్య పేరు మీద ఉన్నటువంటి రెండు ఎకరాల భూమిని మరో అర ఎకరము భూమిని కౌలుకుతీసుకొని అందులో ఒక ఎకరం విస్తీర్ణంలో మిర్చి తోట వేయగా కొంత పత్తి మరికొంత వరి సాగు చేయగా అప్పుచేసి మిర్చి పంటకు పెట్టుబడి పెట్టగా కింటన్నర దిగుబడి వచ్చిందని పంటను గురువారం ఖమ్మం మార్కెట్ కు తరలించగా సుమారు 18000 చేతికొచ్చాయి వాటిని భార్య చేతిలో పెట్టగా ఇంత తక్కువ డబ్బులు ఎందుకు వచ్చాయని ఎందుకు అమ్మ అవని ప్రశ్నించింది ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గణేష్ రాత్రి పొలం వద్దకు వెళ్లి అక్కడ కలుపు మందు తాగి సెల్ఫోన్ ద్వారా పక్కింటి వారికి సమాచారం ఇచ్చాడు వారు వెంటనే సూర్యాపేట జనరల్ హాస్పిటల్ తరలించగా విషయంగా ఉండటంతో ఖమ్మం ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారుఅక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెంది నారు మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు