కోరిన కోరికలు తీర్చే శ్రీ లింగమంతుల స్వామి జాతరకి పోటెత్తిన భక్తులు.
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 18::శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో భాగంగా మూడవరోజైన మంగళవారం చంద్రపట్నం కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది.పసుపు కుంకుమ లతో అలంకరించి పంచవర్ణములతో వేసిన చంద్రపట్నం పై దక్షిణం దిక్కున లింగమంతుల స్వామి వారిని, ఉత్తరం దిక్కున మాణిక్యమ్మ దేవి ని కూర్చోబెట్టి కళ్యాణం జరిగే కార్యక్రమంలో భాగంగా యాదవ పూజర్లు శ్రీ లింగమంతుల స్వామి కళ్యాణం కథ ను, శ్రీ కృష్ణుడి చరిత్ర పై పాటలు పాడుకుంటూ ఎంతో వైభవంగా జరిగిన కార్యక్రమాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్బంగా యాదవ పూజార్లతో కలిసి దేవాలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ చంద్రుడు ఆకాశం లో నిండుగా ప్రకాశించే పౌర్ణమి రోజు అంటే శ్రీ లింగమంతుల స్వామి వారికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి పౌర్ణమి కి భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేసి తడిబట్టలతో దర్శనం చేసుకొని నిద్రిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.చాలా సంవత్సరాలనుండి ప్రతి రెండేళ్లకి ఒక్కసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు నుండి ఐదు రోజులు జరిగే జాతరకు తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఐదారు రాష్ట్రాల నుండి కుల మతాలకి అతీతంగా వచ్చి స్వామి వారి దర్శించుకొంటారని అదే ఆనవాయితీ ప్రకారం కోరిన కోరికలు తీర్చే శ్రీ లింగమంతుల స్వామి వారి జాతర పిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదు రోజులు పాటు అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే స్వామి వారిని దాదాపు లక్షలాది మంది దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం గుట్ట చుట్టూ పరిసర ప్రాంతాలలో నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారని,త్రాగు నీటి వసతి , భక్తుల కొరకు చలవ పందిర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.పోలీస్ శాఖ వారు వాహనాలను దారి మళ్ళించి ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారని, లక్షలాది మంది భక్తులు వచ్చిన అందరికి స్వామి వారి దర్శనం జరిగేలా క్యూ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఆర్ టి సి జాతర కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను భక్తులు అధికంగా వినియోగించుకొంటున్నారని,
భక్తులకి ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో మెంతేబోయిన, తండు వంశీయులు, భైరాని తేరాచీరల యాదవ పూజార్లు, దేవాలయ పాలకవర్గం,తదితరులు, పాల్గొన్నారు.