schedule Wednesday, June 17, 2026

సారాయి అమ్మకాలపై ఉక్కుపాదం

calendar_today February 11, 2025
person meenewstelugu

సారాయి అమ్మకాలపై ఉక్కుపాదం

అక్రమంగా సారాయి తయారు చేస్తే కఠిన చర్యలు

పెన్ పహాడ్ ఎస్సై గోపికృష్ణ

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10::సారాయి అమ్మకాలపై పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ ఉక్కు పాదం మోపారు. మండల పరిధిలోని జల్మలకుంట తండా శివారులో వ్యవసాయ క్షేత్రం వద్ద సారాయి తయారీకి ఉపయోగించే 40 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకొని పారబోసి తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అక్రమంగా సారాయి తయారీ, అమ్మకాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికీ కొంతమంది పై కేసులు నమోదు చేశామని అన్నారు. అదేవిధంగా అక్రమంగా సారాయి తయారు చేసి అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు .ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రవీణ్, లింగరాజు, రామాంజనేయులు, సాయి లు పాల్గొన్నారు.