schedule Tuesday, October 27, 2026

విద్యార్థి భవిష్యత్ కి 10వ తరగతి ఫలితాలు పునాది కలెక్టర్ 

calendar_today January 23, 2025
person meenewstelugu
విద్యార్థి భవిష్యత్ కి 10వ తరగతి ఫలితాలు పునాది కలెక్టర్ 

విద్యార్థి భవిష్యత్ కి 10వ తరగతి ఫలితాలు పునాది కలెక్టర్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 23:::విద్యార్థి భవిష్యత్తు కి పదో తరగతి ఫలితాలు పునాది మన జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అన్నారు గురువారం మధ్యాహ్నం సూర్యాపేట జిల్లాలోని చిర్యంలో మండలం చందుపట్ల బి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలను అకస్మతిగా స్పందించారు ముందుగా పాఠశాలలోని స్థాపన పరిశీలించారు అనంతరం పాఠశాలలోని తరగతి కథలను సందర్శించారు 10వ తరగతి గదిలో జరుగుతున్న తెలుగు క్లాసుని సందర్శించి విద్యార్థులతో కొత్త బాటనే 4వ పాఠాన్ని దివ్యశ్రీ నవీన్ చేత చదివించారు అనంతరం విద్యార్థులతో రాసిన నోటు పుస్తకాలను వారి చేతిరాతను పరిశీలించి పరీక్షలు హ్యాండ్ రైటింగ్ మంచిగా చూసుకోవాలని సూచించారు పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఇంకా 30 రోజులే మాత్రమే ఉన్నందున బాగా కష్టపడి చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలని పాఠశాలకి మంచి పేరు తేవాలి అని కలెక్టర్ తెలిపారు. పరీక్ష రాసే విధానాన్ని విద్యార్థిని విద్యార్థులకు తెలపాలని ఉపాధ్యాయులు సూచించారు పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు జరగపోవడంపై ప్రధాన ఉపాధ్యాయుడు బి శ్రీనివాస్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు వారం రోజులలో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు తదుపరి స్టోర్ రూమ్ ని మెనూ రిజిస్టర్ హాజరు పట్టికను పరిశీలించారు పిల్లల కొరకు తయారుచేసిన మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థులతో ముచ్చటించారు సోమ. బుధ. శుక్రవారం లలో గుడ్లు పెడుతున్నారా అని అలాగే మెనూ ప్రకారం రోజువారి కూరగాయలు చేస్తున్నారా లేదా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు తదుపరి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి పదవ తరగతి పరీక్షలు నూరు శాతం సాధించాలని అందుకొరకు ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు ఏదైనా సబ్జెక్టులు వెనుకబడి ఉంటే ప్రత్యేక తరగతులు నిర్వహించడం కలెక్టర్ సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో చివ్వెంల తాసిల్దార్ కృష్ణయ్య ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.