schedule Wednesday, June 17, 2026

ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలి

calendar_today August 22, 2024
person meenewstelugu

ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలి

 

  కార్యాలయం  చుట్టూ రైతుల ప్రదక్షిణలతో ఆర్థిక ఇబ్బందులు

 

  బిఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి  

 

 రైతుకు బిఆర్ఎస్ అండ 

మీ న్యూస్ ప్రతినిధి గణేష్ 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ ఇచ్చిన గడువు లో రైతులందరికీ రుణమాఫీ చేయలేకపోయిందని తాండూర్ మండల బిఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మండలానికి చెందిన రైతులు తమకు రుణమాఫీ కాలేదని తాండూర్ వ్యవసాయ కార్యాలయం దగ్గర పడి కాపులు కాసారు. విషయం తెలుసుకున్న తాండూర్ మండల బిఆర్ఎస్ రైతు సమన్వయకర్త రామలింగారెడ్డి రైతులకు అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా పలువురు రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చినా గడువులో హామీ నెరవేర్చలేదని అన్నారు కొంతమందికి రైతు రుణమాఫీ చేయడం మిగతా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించడం సరికాదని అన్నారు. కార్యాలయ చెట్టు ప్రదర్శనలు చేస్తున్న రైతులకు రుణమాఫీ కావడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేపు జరగబోయే రైతు రుణమాఫీ పై నిరసన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూర్ మండల వ్యవసాయ రైతులు తదితరులున్నారు