ఇందిరా అనాధ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఆధునిక దేవాలయాలుగా భావించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ
మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా జనవరి 11::::నేడు మునగాల మండల పరిధిలోని ముకుందా పురం గ్రామ పంచాయతీ లో ఉన్న. ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో. హైదరాబాదు నగరం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. బాచుపల్లి గ్రామానికి చెందిన. అడ్వకేట్ . అరణ్య లా అసోసియేషన్ & లీగల్ కౌన్సిల్టెన్సీ అరణ్య సౌరబ్ జాస్తి బంగారు లక్ష్మి దంపతుల కుమారుడు అభిజ్ఞాన్ మోహన్ కృష్ణ ద్వితీయ పుట్టిన రోజు సందర్భంగా. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా. మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని అన్న వితరణ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా.వారికి తెలిసిన లేదా అందుబాటులో ఉన్న ఇలాంటి అనాధ శరణాలయాలు వృద్ధాశ్రమాలలో కనీసం వారికి ఒక్కరోజైనా మంచి ఆహారాన్ని అందించి వారికి అండగా నిలవాలని అదే విధంగా ఇలాంటి అనాధ శరణాలయాలు వృద్ధాశ్రమాలను ఆధునిక దేవాలయాలు గా భావించి ఆశ్రమాలలో ఉన్న అనాధలకు వృద్ధులకు అవసరమైన దుప్పట్లను వస్త్రాలను. వారికి అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించే విధంగా తమకు తోచిన విధంగా ఆర్థిక సహకారం అందించి వారికి మానసిక ప్రశాంతత కల్పించే విధంగా తోడ్పాటును అందించాలని. ప్రతి ఒక్కరూ సౌరబ్ బంగారు లక్ష్మీ దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. అలాగే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వాటిని. నిత్యం వెలుగులోకి తేవాలని. అలాగే ఈ ఆశ్రమానికి ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచపల్లి జ్యోతి. ఎమ్మెస్సార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.