schedule Wednesday, June 17, 2026

calendar_today June 27, 2024
person meenewstelugu

ప్రతి యువసేన సభ్యుడికి అండగా ఉంటా:అర్.సి గౌడ్  -మృతుడి కుటుంబానికి ఆర్.సి గౌడ్ చేయూత -అంత్యక్రియల కోసం రూ.10వేలు ఆర్థిక సాయ

దీక్షతెలుగు, న్యూస్ :

  1. ఆర్సిగౌడ్ యువసేన ప్రతి సభ్యుడికి ఆపదలో అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని తాండూరు మండలం టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ధైర్యం చెప్పారు.తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఆర్.సి గౌడ్ యువసేన సభ్యుడు నాగారం శ్రీనివాస్ గుండె పోటుతో అక్కాల మరణం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆర్.సి గౌడ్ వెంటనే ఆయన యువసేన సభ్యులను మృతుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతుగా రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10,000 నగదును ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, మృతుడి కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటాడని హామీ ఇచ్చారు. ప్రతి యువసేన సభ్యుడికి అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని, మీకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాడని ఆర్సి గౌడ్ భరోసా ఇచ్చినట్లు ఆయన ముఖ్య అనుచరుడు తెలిపారు.ఈ కార్యక్రమం ఆర్సి గౌడ్ యువసేన సభ్యులు, గ్రామ పెద్దలు ఉన్నారు.