schedule Friday, June 19, 2026

సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గునగంటి నాగరాజు గౌడ్ ఎన్నిక 

calendar_today December 5, 2024
person meenewstelugu

సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గునగంటి నాగరాజు గౌడ్ ఎన్నిక 

మోతె: మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4:: మోతీ మండలం అఖిల భారత యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలలో జూలై 9న ఆన్లైన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ఎన్నికల ఫలితాలలో సిరికొండ గ్రామానికి చెందిన గునగంటి నాగరాజు గౌడ్ 1388 ఓట్లతో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డికి వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులకు, యువజన నాయకులకి కృతజ్ఞతలు తెలిపారు. నాగరాజ్ గౌడ్,యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలు పొందడంతో మండల కేంద్రంలో యువకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.