schedule Wednesday, June 17, 2026

calendar_today April 27, 2024
person meenewstelugu

మానవత్వం చాటుకున్న ఆర్.సి గౌడ్...! -పేద కుటుంబానికి ఆర్థిక సాయం -రూ.5వేలనగదు అందజేసిన ఆర్.సి గౌడ్

దీక్షతెలుగు,న్యూస్ :

  మరణించిన పేద కుటుంబాలకు తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ అండగా ఉంటూ తన ద్వారా ఆర్థిక సహాయం అందించడం హర్షనీయమని మల్కాపూర్ గ్రామ ప్రజలు అన్నారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మంగలి జర్నప్ప కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించారు. విషయం తెలుసుకొని ఆర్.పి గౌడ్ అంత్యక్రియల కోసం మృతుడు కుటుంబానికి 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పేద కుటుంబంలో మరణించిన వారి అంత్యక్రియల ఖర్చులకు 5వేల రూపాయలు అందించి ఆర్ సి గౌడ్ మానవత్వాన్ని చాటుకుంటున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు రఘు గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కాశీనాథ్, వెంకటప్ప, ఆనంద్, రమేష్, సురేష్, కాశీనాథ్, మల్లేష్, సాయి గౌడ్, తదితరులు, ఉన్నారు.