schedule Monday, June 15, 2026

సాయిబాబా దేవాలయంలో పూజలు 

calendar_today December 2, 2024
person meenewstelugu

సాయిబాబా దేవాలయంలో పూజలు 

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 :: సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సాయి నగర్ సాయిబాబా దేవాలయంలో ఆదివారం అమావాస్య ,కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా శివునికి పంచామృత అభిషేకం ,ఏకవార రుద్రాభిషేకం ,అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం త్రిమూర్తులు గల చెట్ల వద్ద పూజలు చేశారు .ఈ సందర్భంగా మహిళలు గోమాతకు పసుపు ,కుంకుమలతో పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షులు కర్నాటి రవికుమార్ ,తల్లాడ వెంకటేశ్వర్లు దంపతులు ,పోతుగంటి మల్లికార్జున్ ,పూజారులు విశ్వేశ్వర శర్మ గంగాధర శర్మ తదితరులు పాల్గొన్నారు.