schedule Wednesday, June 17, 2026

calendar_today April 14, 2024
person meenewstelugu

అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి -కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే ముందుకు వెళుతుంది -అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మేఘనాథ్ గౌడ్

దీక్షతెలుగున్యూస్, తాండూరు :
అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగేమ్ కాలనీ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ అన్నారు.అంబేద్కర్‌ జయంతి 133వ సందర్భంగా ఆదివారం తాండూరు మండలం సంగం కాలనీ గ్రామంలో మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ నాయకులతో కలిసి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేఘనాథ్ గౌడ్ మాట్లాడుతూ..రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు.ఆయన కలలను సాకారం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు ఉన్నారు.