schedule Friday, June 19, 2026

బీజేవైఎం న్యాల్ కల్ మండల అధ్యక్షుడిగా విష్ణు సునర్ 

calendar_today November 12, 2024
person meenewstelugu

బీజేవైఎం న్యాల్ కల్ మండల అధ్యక్షుడిగా విష్ణు సునర్ 

మీ న్యూస్ ప్రతినిధి 

సంగారెడ్డి.మండల కేంద్రం మైన న్యాల్ కల్ లో సమావేశం ఏర్పాటు చేసి న్యాల్ కల్ మండల బీజేవైఎం అధ్యక్షుడిగా సునార్ విష్ణు ని నియమించినట్లు మండల పార్టీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ తెలిపారు.ఈ నియమక పత్రాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు గొల్ల భాస్కర్ మరియు ఓబిసి జిల్లా అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ శివాజీ రావు పాటిల్ ,బిజెపి మండల అధ్యక్షలు ఓంకార్ యాదవ్ గార్ల చేతుల మీదుగా విష్ణు సునర్ కి అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా విష్ణు మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నన్ను బీజేవైఎం మండల అధ్యక్షులుగా నియమించిన మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ అన్న మరియు సీనియర్ నాయకులందరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమాలంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు మల్లేష్ గంగ్వార్,రాహుల్ పాలింకర్ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి నవీన్ విరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్