schedule Friday, June 19, 2026

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి

calendar_today November 12, 2024
person meenewstelugu

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి

 

 కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

 

మీ న్యూస్ ప్రతినిధి ::: మునగాల : మునగాలలోని సర్వీసు రోడ్డుపైన మరియు అండర్పాస్ బ్రిడ్జి నుంచి గణపవరం గ్రామం వరకు నిర్మాణం చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్డుపై నీళ్లు చెల్లించి దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు నేను కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. జిఎంఆర్ సర్వీస్ రోడ్డుపై గత కొన్ని నెలల నుంచి పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు జిఎంఆర్ సంస్థతో మాట్లాడి రోజు నీళ్లు కొట్టే విధంగా చర్య తీసుకోవాలని కోరాను. మరియు గణపవరం రోడ్డులో నిర్మాణం చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్డులో సంబంధిత కాంట్రాక్టర్ భూమిని చదును చేస్తు నీళ్లు కొట్టించకపోవడం వల్ల అట్టి రోడ్డుపై వాహనాలు వచ్చినప్పుడు విపరీతమైన దుమ్ము దూళితో రహదారిపై నడిచే ప్రజలు విద్యార్థులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుమ్ము వల్ల దృష్టిలోపం ఎదురవుతుందని తక్షణమే ఈ రెండు సమస్యలపై స్పందించి ప్రతిరోజు నీళ్లు కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఆర్డీవో గారు వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి ట్యాంకర్ ద్వారా నీళ్లు కొట్టించి దుమ్ములేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

[gallery ids="2875"]