అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన టిఆర్ఎస్ పార్టీ ఆర్ సి గౌడ్
calendar_today
October 29, 2024
person
meenewstelugu
అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన టిఆర్ఎస్ పార్టీ ఆర్ సి గౌడ్
తాండూర్ రూరల్ మీ న్యూస్ ప్రతినిధి::తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మంతట్టి సత్యామ్మ కూతురు సుజాత అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని ఆర్ సి గౌడ్ యువసేన సభ్యుల ద్వారా తెలుసుకున్న తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షుడు ఆర్.సి గౌడ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలు అందజేశారు, ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ పెద్దలు, యువ నాయకులు ఆర్ సీ గౌడ్ యువసేన సభ్యులు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.