schedule Friday, June 19, 2026

ఎస్సీ వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని 

calendar_today October 4, 2024
person meenewstelugu

ఎస్సీ వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని 

ఎస్సీ వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ 
 
మీ::న్యూస్ అక్టోబర్ 04:::హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణ జరిగిన తార్వత ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం డిస్సెసీ ద్వారా 11062 టీచర్ ఉద్యోగాలను అక్టోబర్ 9 నాడు దసరా పండుగ కానుకగా ఎల్బీ స్టేడియంలో టీచర్ ఉద్యోగాల పోస్టుల నియామకా పత్రంల అందించనున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండా నియమాలు జరిపితె మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తే మాదిగలకు సుమారు వేయ్యి ఉద్యోగాలు వస్తాయి అని. వర్గకరణ ప్రకారం కాకుండా ఉద్యోగాలు నింపితే కేవలం రెండు మూడు వందల ఉద్యోగాలు కుడా మాదిగలకు రావు అని 20 సంవత్సరాల నష్టం మాదిగలకు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల ఐక్యవేదిక నాయకులు దెవని సతీష్ మాదిగ గజ్జెల కాంతం మేరి మాదిగ గాదె దయాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.మీ న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్