schedule Tuesday, July 28, 2026

సైన్స్ డ్రామా ఫెస్టివల్లో రాష్ట్రస్థాయి ఎంపిక 

calendar_today September 28, 2024
person meenewstelugu

సైన్స్ డ్రామా ఫెస్టివల్లో రాష్ట్రస్థాయి ఎంపిక 

మీ:: న్యూస్ ప్రతినిధి చంద్రయ్య::సైన్స్ డ్రామా ఫెస్టివల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పట్ల అభినందనీయం,,, మండల విద్యాశాఖ అధికారి బి రాములు నాయక్ నవ తెలంగాణ నూతనకల్,, మండల పరిధిలోని పెదనెమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైన్స్ డ్రామా ఫెస్టివల్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల మండల విద్యాధికారి బి రాములు నాయక్ అభినందించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాల భవన్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ లో పాల్గొని "వృక్షో రక్షతి రక్షతః " అనే అంశం పై ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి కి ఎంపిక అయినట్లు తెలిపారు.. విద్యార్థులచే చక్కటి డ్రామాలు తయారు చేయించి ప్రదర్శింపజేసిన సామాన్య శాస్త్ర ఉపాధ్యాయులు హరికృష్ణ,ఉమారాణి లను ప్రత్యేకంగా అభినందించారు. ప్రదర్శించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శివయ్య, ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి చైర్మన్ అరుణ, పాఠశాల ఉపాధ్యాయులు,,వెంకయ్య,సువర్ణలక్ష్మి,శమీమ్ సుల్తానా,ప్రశాంతి,విజయలక్ష్మి,సుధీర్ కుమార్, సీఆర్పీ రవీందర్ లు అభినందించారు.